DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారే తప్ప ప్రజల కోసం... ఏమాత్రం ఆలోచించడం లేదని ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే అర్థమవుతుంది.
ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం మార్చి 31 కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించి నా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ నేతలు, కేసీ వేణు గోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం బోర్డు సోమవారం రాత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే 9 అభ్యర్థుల జాబితాలను విడుదల చేయగా, ఇద్దరు అభ్యర్థులతో 10వ జాబితా ను తాజాగా ప్రకటించింది. మహారాష్ట్రలోని అకోలా నుంచి అభ్యర్థిగా డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిం చింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.