DBN TELUGU:- ఆదిలాబాద్ పట్టణంలో యాదవ సంఘం భవనం తెలంగాణ స్టూడెంట్ ఫోరం టిఎస్ఎఫ్ లోగో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, అలాగే శాస్త్ర విద్యా విధానం అమలు చేయాలని, కామన్ స్కూల్ విద్యా విధానం కోసం కృషి చెయ్యాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి, పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ కాస్మొటిక్ చార్జిలు పెంచాలి విద్యారంగా సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ స్టూడెంట్ ఫోరం టీఎస్ఎఫ్ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ, ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గొడం రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజ్మీర వినోద్ నాయక్, ఏఐఎస్బి రాష్ట్ర అధ్యక్షుడు జీవారే రాహుల్, ఏఎస్యు జిల్లా అధ్యక్షుడు పెందుర్ దాదే రావు, కార్యదర్శి మం అశోక్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మం గణేష్, ఎస్విఏ జిల్లా అధ్యక్షుడు జి సుజయ్, టిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి రాహుల్, ఉపాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి ఇఫ్తార్, సహాయ కార్యదర్శి సత్యనారాయణ, మీరా రాకేష్, అనసూయ, మమత, నిఖిత, అశ్విని, రజిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

