DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకే రోజు మూడు పార్టీలు సభలు ఏర్పాటు చేయడంతో రాజకీయం హీట్ ఎక్కుతుంది.
తెలంగాణలో లోక్‌సభ దంగల్‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ సభ వేదికగానే మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. ఇక ఈ రోజు కరీంగనగర్ వేదికగా ఎన్నికల శంఖరావం పూరించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శర వేగంగా కొనసాగుతున్నాయి. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారా చూడాలి.