DBN TELUGU:-
> కోర్టును సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు.
> పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటన.
> న్యాయ సంబంధిత విషయాలపై విద్యార్థులకు అవగాహన.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ విద్యార్థులు మంగళవారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. కళాశాల క్షేత్ర పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టీ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
> న్యాయ సంబంధిత విషయాలపై అవగాహన <
కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకులు కే సమ్మక్క ఆధ్వర్యంలో బిఏ ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులు మంగళవారం ఉదయం కళాశాల నుంచి బయలుదేరి బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు చేరుకున్నారు. అక్కడ జడ్జి జానమంచి ముఖేష్ ని కలిశారు. కోర్టు నిర్వహణ న్యాయ సంబంధిత విషయాల గురించి అక్కడి సిబ్బంది ద్వారా అవగాహన చేసుకున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే ఇటువంటి అనేక కార్యక్రమాలు ముందు ముందు కూడా చేపడుతామని ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

