వివరాలు చూసుకుంటే... కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జ్యోతి రావు పూలే, సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహాలను అదే గ్రామానికి చెందిన యువకుడు తాగిన మైకంలో గొడ్డలితో ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులపై దుర్భాశలాడినట్లు తెలిపారు. వెంటనే గ్రామస్తులు సంబంధిత పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్: మహనీయ దంపతుల విగ్రహాలు ధ్వంసం.
February 21, 2024
0
DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో మహనీయులైన జ్యోతి రావు పూలే, సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది.
Tags