Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం...!

DBN TELUGU:- మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు ( Bullets ) కలకలం సృష్టించాయి. 





ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ నర్సాపూర్‌ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి. కేసీఆర్ సభలో ప్రసంగిస్తుండగా అస్లాం అనే యువకుడు అనుమానాస్పందంగా తిరుగుతుండడంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. అస్లాం నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.