Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: బీజేపీ ప్రచార రథంపై దాడి...!

DBN TELUGU:- 

- బీజేపీ ప్రచార రథంపై దాడి.

- అద్దాలు ధ్వంసం.

- విచారణ చేపడుతున్న పోలీసులు.

ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి గ్రామంలో గురువారం రాత్రి బీజేపీ అభ్యర్థి ప్రచార వాహనాన్ని కొంతమంది అడ్డుకొని దాడికి పాల్పడ్డారు.





ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. గుండి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో తమ గ్రామానికి ఏ రాజకీయ పార్టీలు ప్రచారానికి రావద్దని గ్రామ పొలిమేరల్లో గ్రామస్థులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన బీజేపీ వాహనంపై దాడికి దిగారు. దీంతో బీజేపీ అభ్యర్థి వాహనం ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణను చేపట్టారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.