Type Here to Get Search Results !

గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా మెడికల్ క్యాంప్: సర్పంచ్.

DBN TELUGU:- కాసిపేట మండలంలోని మామిడిగూడ గ్రామపంచాయతీలో గ్రామప్రజల ఆరోగ్యం దృష్ట్యా గురువారం కాసిపెట ప్రభుత్వ వైద్యలు డాక్టర్ రవికిరణ్ అధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.





ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక గ్రామ సర్పంచ్ సంపత్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూూ.... తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత వైద్యం అందాలని, గ్రామంలోని ప్రజలు ఎవ్వరు  కూడా  జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, మీకు ఏదైనా సమస్యలు ఉంటే డాక్టర్ కి తెలియజేయలని మరియు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్, అనిల్, సూపర్ వైజర్ కళావతి, ఏ న్ ఎం రజిని కుమరి, జ్యోతి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.