DBN TELUGU:- కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ పంచాయతీ లోని గుర్వపూర్ గ్రామంలోని 70 మంది ప్రజలు, యువకులు, మహిళలు కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన గ్యారంటీలకి ఆకర్షతులై పేద ప్రజలకు న్యాయం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని గ్రహించి వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే సోనియమ్మ ప్రకటించిన ఎకరానికి 15వేల పెట్టుబడి సాయం కౌలు రైతులకి కూడా ఇవ్వడం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలు 2500 ఇలాంటి పథకాలు ప్రజలందరికీ నచ్చాయని వాళ్లే అందుకే స్వచ్చందగా పార్టీ లో చేరుతం అని వస్తున్నారని, రానున్న రోజుల్లో ఈ చేరికలు మరింత పెరుగుతాయని తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో బెల్లంపల్లి లో గడ్డం వినోద్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో శ్రావణ్, నాగవత్ రాము, మారం సురేష్, మారుతీ, రవి రాజా తదితరులు పాల్గొన్నారు.