Type Here to Get Search Results !

జోనల్ క్రీడలకు సమన్వయంతో తగిన ఏర్పాట్లను చేయాలి: ఆర్సీఓ.

DBN TELUGU:- అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోవు జోనల్ స్థాయి క్రీడాపోటీలను సమన్వయంతో సక్సెస్ చేయాలని ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి సూచించారు.





తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల (సిఓఈ) బెల్లంపల్లిలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అద్యక్షతన జోనల్ క్రీడల కోఆర్డినేషన్ మీటిగ్ కు ఆమె ముఖ్యఅథిదిగా ఆదిలాబాద్ రీజియన్ ఆర్సీఓ కొప్పుల స్వరూప రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా జోన్ 1 లోని కుమ్రంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు జిల్లాలకు చెందిన సంక్షేమ బాలుర గురుకులాల ఫిజికల్ డైరెక్టర్స్, వ్యాయామ ఉపాధ్యాయులనుద్దేశించి ఆమె మాట్లాడారు.... వచ్చేనెల 13వ తేదీ నుండి జరగనున్న 9వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్- 2023 సక్సెస్ కోసం ప్రతి ఒక్కరూ భాద్యతా యుతంగా సంబందిత పనులను పూర్తిచేసుకోవాలన్నారు. ఈ జోనల్ క్రీడాపోటీలకు వచ్చే సుమారు 12 వందల మంది విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్ధులకు వసతి, బోజనం, ఇతర సౌకర్యాల కల్పనలో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని క్రీడా పోటీలను సక్సెస్ చేయాలని సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు కు సూచించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంబేడ్కర్ చిత్రపఠానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆదిలాబాద్ రీజియన్ రీజినల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సట్లశంకర్ ఆధ్వర్యంలో పలు కమిటీలను వేశారు. సీనియర్ అధ్యాపకులు కోటిచింతల మహేశ్వర రావు, సీనియర్ పిడిలు వి.రవి, ఆర్.శ్రీధర్ ల ఆద్వర్యంలో పలు క్రీడలకు సంబందించిన డ్రాషీట్స్ తీశారు. ఆర్సీఓ తో కలిసి వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడామైదానాన్ని పరిశీలించి స్థానిక పిడి పీఈటిలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాసిపేట, బెల్లంపల్లి బాలికలు, రెబ్బన, సిర్పూర్-టి బాలికలు ప్రిన్సిపాల్స్, పిడి, పిఇటిలు అల్లూరివామన్, నడిగొట్టి రాకేష్, జి.సంతోష్, డి.రాజలింగు, కె.రాజేష్, బి.రఘు, జె.సుధాకర్, యస్.సంతోష్, కె.శ్రీకాంత్, కె.బాస్కర్ తదితరులు పాల్గొనారు.





Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.