DBN TELUGU:- అన్నమయ్య జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి లారీ, బస్సు డ్రైవర్లు ఇద్దరూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.... సంబేపల్లె మండలంలోని దేవపట్ల దగ్గర లారీ మరియు టూరిజం ప్రైవేటు బస్సు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెదగా.... బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి, కడప, ఇతర ప్రాంతాల ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. తీర్ధయాత్రలకు వెళుతుండగా అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.