DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపెట్ మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన ఎం.డీ ఖాదర్, ఎం.డీ ఖదీర్, ఎం.డీ షగీర్, ఎం.డీ గౌస్, షేక్ హైమధ్ తో పాటు 50 మంది మైనారిటీ నాయకులు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో చేరారు.
వారికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి... వారందరినీ ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అటు బెల్లంపల్లి నియోజకవర్గాన్ని... ఇటు కాసిపేట మండలాన్ని ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి తాము టిఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, బి.అర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోల్లు రమణా రెడ్డి, బి.అర్.ఎస్ పార్టీ దేవాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు వడ్లూరి మల్లేశ్, బి.అర్.ఎస్ పార్టీ నాయకులు అనంత్ రావు, బందేల ప్రేమ కుమార్, దారవత్ కైలాష్, గోనె రవీందర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.