DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ బెల్లంపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి వర్క్ షాప్ వద్ద, నిరుద్యోగ యువతి యువకుల కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించేందుకు కేటాయించిన స్థలాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి పరిశీలించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వీలైనంత తొందరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, సంబంధిత అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.