DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెల చివరిలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన దిగిన విషయం తెలిసిందే తాజాగా....
ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మద్దతుగా పరీక్ష వాయిదా వేయాలని సీఎస్ శాంతి కుమారి ని ఆదేశించారు. విద్యార్థులకు అనుగుణంగా పరీక్షలు పెట్టవల్సిందిగా ఇంకోసారి ఇలాంటి సమస్యలు ఎదురవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మిగితా పరీక్షలకు సన్నదం అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాయిదా వేసిన పరీక్షలను... తిరిగి మళ్లీ నవంబర్ నెలలో నిర్వహిస్తామని దానికి సంబంధించిన షెడ్యూల్ ని తొందరనే విడుదల చేస్తామని తెలిపారు.