DBN TELUGU:- వేసవికాలం దృష్ట్యా మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలందరికీ కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇన్ని రోజులుగా ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీరు సరఫరా చేయడం జరిగింది. వేసవికాలం ముగియడంతో ఆదివారం తో ఉచిత మంచినీరు కార్యక్రమం ముగించడం జరిగింది. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచినీరు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 64 రోజుల పాటు ట్రస్ట్ ద్వారా ప్రజలకు మంచినీరు అందించినట్లు తెలిపారు. భవిష్యత్ లో కూడా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.